నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 17న జరుగనున్న తిరుపతి ఉపఎన్నిక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు, ఎన్నికల నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేసే అంశంపై అధికారులకు సూచనలు చేశారు.
ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుండటం.. తదుపరి ఎలాంటి రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని అధికారులకు ఆదేశించారు. అలాగే స్థానికేతరులైన రాజకీయ నాయకులెవరూ తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉండరాదని అధికారులకు స్పష్టం చేసి చెప్పారు. ఈ అంశంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. మరోవైపు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి...