భారత జలాల్లోకి ప్రవేశించిన శ్రీలంక బోటును మచిలీపట్నం తీరంలో మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీ బేసిన్లో టూనా చేపల వేటకు వచ్చిన ఆరుగురు శ్రీలంక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ బోటు భారత జలాల్లోకి ప్రవేశించిందన్న సమాచారం అందుకున్న కాకినాడ కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రియదర్శిని బోటులో వారిని వెంటాడి పట్టుకున్నారు. ఆరుగురిని కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. వీరిని క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు మెరైన్ సీఐ గౌరీశంకర్ తెలిపారు.
ఇదీ చదవండి: