విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ప్రభుత్వం-మనది అనే భావనతో ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని...ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగి నెలకొక మొక్క నాటి... సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు కోరారు. రాష్ట్రంలోని 1,500కి పైగా సచివాలయ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ఇతర ఉద్యోగులకు పరోక్షంగా ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి: తాడేపల్లిలో ఓ ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు