ETV Bharat / state

Special Story on Organic Chilli Farming: సేంద్రీయ సాగులో రాణిస్తున్న రైతు.. వినూత్న ఆలోచనతో మంచి లాభాలు - Organic Chilli Cultivation from krishna district

Organic Chilli Cultivation in krishna district: పండించిన పంటలను మార్కెట్‌కు తరలించడంతోనే ఆగిపోకుండా వాటికి విలువను జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఓ రైతు నిరూపిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంతో ఉత్పత్తులకు సొంతంగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పంటల్లో మార్పులు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన నాగేశ్వరరావు విజయగాథపై ప్రత్యేక కథనం.

మిర్చి సేంద్రీయ సాగులో రాణిస్తున్న రైతు నాగేశ్వరరావు

author img

By

Published : Dec 23, 2021, 1:04 PM IST

మిర్చి సేంద్రీయ సాగులో రాణిస్తున్న రైతు నాగేశ్వరరావు

Organic chilli farming in krishna district: ఈయన పేరు కర్ల నాగేశ్వరరావు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన ఈ రైతు.. కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో మిరపను పండిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో మిర్చి సాగు చేస్తున్న రైతుల కంటే నాణ్యమైన దిగుబడిని నాగేశ్వరరావు పొందుతున్నారు. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడకుండా పంట చేతికి అందిన తర్వాత మిరపకాయలను విక్రయిస్తున్నారు. సొంతంగా మిల్లు ఏర్పాటు చేసుకుని కారపు పొడిని అమ్ముతూ.. మంచి ధర పొందుతున్నారు.

నాణ్యమైన దిగుబడితో మంచి లాభాలు..

ప్రస్తుత పరిస్థితుల్లో రైతు...కేవలం రైతుగానే ఉండి పోతే ఆర్థిక బాధలు తప్పవంటున్నారు నాగేశ్వరరావు. సేంద్రియ సాగులో మిర్చి పండిస్తోన్న తనకు దిగుబడి భారీగా రాకపోయినా... ఆరోగ్యమైన క్రిమిసంహారక రసాయన రహిత పంటతో ధర మెరుగ్గానే వస్తోందని చెబుతున్నారు. ఈ మిర్చితోనే... పండు మిరప, ఆవకాయ, గోంగూర, నిమ్మ, చింతకాయ, టమోట పచ్చళ్లను కుటుంబ సభ్యుల సహకారంతో చేయించి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు రైతు నాగేశ్వరరావు ఆలోచనను అభినందిస్తున్నారు. విలువ ఆధారితంగా ముందుడుగు వేస్తుండడాన్ని ప్రత్యక్షంగా చూసి ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి...

Head master punishment: తల్లిముందే విద్యార్థినిని చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.