ETV Bharat / state

జిల్లాలో... పాజిటివిటీ రేటు @ 16.96%!

కృష్ణా జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న వచ్చిన ఫలితాల్లో 16.96 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అవసరాలకు అనుగుణంగా పడకలు అందుబాటులో లేని కారణంగా.. బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోంఐసోలేషన్‌, కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు వెళుతున్నా... ఆక్సిజన్‌, ఇతర వైద్యసేవలు అవసరమైన వారికి సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.

covid cases
కరోనా కేసులు
author img

By

Published : May 13, 2021, 5:11 PM IST

కృష్ణా జిల్లాలో నిన్న 10,824 నమూనాలకు సంబంధించి ఫలితాలు రాగా, అందులో 1836 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 8988 మందికి నెగెటివ్‌ వచ్చింది. జిల్లాలో ప్రస్తుతం కరోనాతో 17,959 చికిత్స పొందుతున్నారు. రివకరీ రేటు 85.26 శాతం నమోదైంది. పాజిటివ్‌ రేటు తగ్గకపోవడం, ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుండటంతో బాధితులకు చికిత్స అందించడానికి యంత్రాంగం ముప్పతిప్పలు పడుతోంది.

ఇదే సమయంలో కొందరు వైద్యులు కూడా కొవిడ్‌ బారిన పడి విధులకు దూరం కావడంతో వైద్య సిబ్బందిపై అదనపు పనిభారం ఉంటోంది. మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ కొరత రాకుండా ఆసుపత్రులకు అవసరాల మేరకు సర్దుబాటు చేయడానికి యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలతో ఆసుపత్రులపై కొంత ఒత్తిడి తగ్గినా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తుండటంతో అవసరాలు తీరడం లేదు. వైరస్‌ విజృంభణతో కొందరు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడానికి వెనుకడుగు వేస్తున్నారు.

  • జిల్లాలో మొత్తంఆసుపత్రులు 111
  • ఐసీయూ పడకలు 1270
  • ఐసీయూ లేకుండా ఆక్సిజన్‌ ఉన్నవి3688
  • ఐసీయూ, ఆక్సిజన్‌ సౌకర్యం లేనివి 2047
  • ఆసుపత్రుల్లో ఉన్న మొత్తం పడకలు7005
  • ఇప్పటివరకు రోగులతో నిండినవి 5821
  • అందుబాటులో ఉన్నవి 1184

జిల్లాలో ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా 26967 కరోనా కేసులు నమోదయ్యాయి. మే నెలలో ఇప్పటి వరకు 20933 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇదే ఒరవడి కొనసాగితే మే నెలలో అధిక కేసులు నమోదయ్యే పరిస్థితి ఉందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో అధికంగా 21443 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వైరస్‌ ఈఏడాది మార్చి నెల నుంచి మళ్లీ విజృభిస్తోంది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా మౌలికవసతులు, మానవ వనరులు లేకపోవడంతో వీలైనంత వరకు హోం ఐసోలేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చి వైద్యులు టెలీ మెడిసిన్‌ ఇస్తున్నారు.

వైరస్‌ సోకిన వెంటనే గుర్తించిన వెంటనే మందులు వాడకం మొదలుపెడితే కోలుకుంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం ముందు జాగ్రత్తగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొందరికి కరోనా వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోయినా భయంతో వచ్చి చేరిపోతున్నారని నగరానికి చెందిన వైద్యుడొకరు అన్నారు. దీనివల్ల అత్యవసరమైన పరిస్థితుల్లో వచ్చిన వారికి వెంటనే పడకలు కేటాయించలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండటంతోపాటు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని ఇతరులకు విస్తరించకుండా చూసుకోవడం ద్వారానే వైరస్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

  • కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు : 13
  • అందుబాటులో ఉన్న మొత్తం పడకలు : 4343
  • రోగులతో నిండినవి: 2133
  • అందుబాటులో ఉన్నవి : 2210
  • పన్నెండు రోజులు.. 20933 కేసులు

ఇదీ చదవండి:

రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: గవర్నర్​కు భాజపా లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.