ETV Bharat / state

మంగళగిరిలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తొలి సమావేశం

author img

By

Published : May 15, 2020, 11:46 PM IST

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో అక్రమ ఇసుక అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీలతో డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి సమావేశం జరిపారు.

Special Enforcement Bureau  first meeting in mangalagiri
మంగళగిరిలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తొలి సమావేశం

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో అక్రమ ఇసుక అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మద్యం పాలసీని పటిష్టంగా అమలు చేసే దిశగా ఈ కొత్త శాఖకు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్​లాల్ ఆధ్వర్యంలో తొలి వీడియో కాన్ఫరెన్స్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగింది.

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విధి విధానాలను జిల్లాల ఎస్పీలకు డీజీపీ వివరించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.., పనితీరు, ఎస్పీలతో చర్చించారు. అక్రమ ఇసుక తవ్వకాలు నివారణ, అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్టు, వారెంట్లను అమలు చేయడం, పీడీ యాక్టులను ప్రయోగించడం ప్రాధాన్యతా అంశాలుగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించారు. ఫలితాలను సాధించేందుకు విప్లవాత్మక చర్యలను తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ఉన్న ఉద్యోగులను 70 శాతం మందిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకి, మిగతా 30 శాతం ఎక్సైజ్​ శాఖలోనే విధులు నిర్వర్తించాలని సూచించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్​కి బదలాయించిన ఉద్యోగులు.. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలని డీజీపీ తెలిపారు. ఈ శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను జారీచేసే విధంగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు.

ఇదీచూడండి. కృష్ణాజిల్లాలో కోవిడ్- 19 కేంద్ర బృందం పర్యటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.