ETV Bharat / state

బియ్యం కార్డులున్నా సాయం అందడం లేదు - పేదలకు ఆర్థిక సాయం

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే కొన్ని చోట్ల లబ్ధిదారులకు నగదు అందడం లేదు. జాబితాలో పేరు లేదని, యాప్​లో పేరు కనబడటం లేదని సచివాలయం సిబ్బంది చెప్పటంతో పేదలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

financial assistance
financial assistance
author img

By

Published : Apr 5, 2020, 11:56 AM IST

విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామంలో బియ్యం కార్డుదారులకు నగదు అందక ఆదివారం సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అర్హుల జాబితాలో పేరు లేదని, యాప్​లో పేరు కనబడటం లేదని సచివాలయ సిబ్బంది డబ్బులు ఇవ్వటం లేదు. లాక్​డౌన్ కారణంగా శనివారం నగదు తీసుకోలేకపోయామని... ఇవాళ వస్తే పేర్లు లేవని చెప్పడం దారుణమని కార్డుదారులు గగ్గోలు పెడుతున్నారు. వాలంటీర్లు ఇళ్లకే నగదు తెచ్చి ఇస్తారని సీఎం జగన్​ చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని వాపోతున్నారు. నగదు అందకపోతే ఆకలి దప్పులు తప్పవని వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు 1000 రూపాయలు అందించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ వేళ దాతలుగా మారిన యాచకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.