2018-2019 సంవత్సరానికి, 2019-2020 సంవత్సరాలకు సంబధించి కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వద్ద గ్రామసభలు నిర్వహించారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు నమోదు చేసుకుని వాటిని సరిదిద్దుకోవాలని అవకతవకలు చేసినవారికి తెలిసినా.. మళ్లీ అవినీతికి పాల్పడ్డారు. మండలం మొత్తానికి మోపిదేవిలో జరిపిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో... అవినీతి అక్రమాలు చేసినవారిని సంజాయిషీ కోరి.. వారినుంచి ఆ మొత్తం రాబట్టడానికి విచారణ జరిపారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మోపిదేవి కార్యాలయంలో 2018 -19 సంవత్సరానికి రూ.3,02,407, 2019-2020 సంవత్సరానికి రూ.2,02,740 అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామని, సంజాయిషీ చెప్పుకునే మరో అవకాశం కూడా ఇస్తామని ఆడిట్ చేసినవారు తెలిపారు. అప్పటికీ చెల్లించని పక్షంలో.. ఆయాశాఖల ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మోపిదేవి మండలంలో 2018 -19 సంవత్సరానికి రూ.1,16,579, 2019-2020 సంవత్సరానికి రూ.15,339 అక్రమాలు జరిగాయని వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా... కొందరు అవినీతిపరుల వలన పేదలు ఇబ్బంది పడుతున్నారు. సామాజిక తనిఖీలో పనులు చేయకుండా రికార్డులు చూపిన లక్షల రూపాయలకు లెక్కలు సరిపోక పోవడం, పర్యవేక్షించాల్సిన ఆయా కార్యాలయాలపై అధికారులు సరిగా సూపర్విజన్ చేయకపోవడం వలనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు సంబధిత శాఖల్లో కాజేసిన రికవరీ మొత్తాలను ఆయా శాఖలకు జమచేసేలా వెంటనే తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: