తెదేపా పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడిగా సీతారామయ్య - latest news for tdp leader in krishna
కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తెదేపా అధ్యక్షుడిగా చింతల సీతారామయ్యను ఎన్నుకొన్నారు. పెనుగంచిప్రోలులో జరిగిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌లు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత వారు మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని కోరారు.