విజయవాడ రాయనపాడులో శ్రామికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును అధికారులు ప్రారంభించారు. భువనేశ్వర్‌కు చెందిన సుమారు 700మంది వలస కూలీలతో శ్రామిక రైలు ఇవాళ ఉదయం బయలుదేరింది. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని రైలులో పంపించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు పంపించారు. శ్రామికుల కోసం విజయవాడ నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: