ETV Bharat / state

కృష్ణాజిల్లాలో 10 మంది ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు

వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి 10 మంది మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు గైర్హాజరు కావడంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అంసతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు
author img

By

Published : Apr 18, 2019, 7:50 PM IST

కృష్ణాజిల్లాలో 10 మంది ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు
వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారంపై అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కృష్ణాజిల్లా కలెక్టర్ చర్యలుతీసుకున్నారు. తీవ్రమైన ప్రజాసమస్యను చర్చించేందుకు నిర్వహించిన సమావేశానికి 10 మంది మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు గైర్హాజరు కావడంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అంసతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యపై కలెక్టరు ఇంతియాజ్‌తోపాటు జడ్పీ సీఈఓ షేక్‌ సలాం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సాయినాథ్‌ తదితరులు సమావేశమయ్యారు. తాగునీటి సమస్యపై వస్తోన్న ఫిర్యాదులపై, అధికారులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను జడ్పీ సీఈవో, కలెక్టర్... ఈ సమావేశంలో వివరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, చందర్లపాడు, జి.కొండూరు, కంచికచర్ల, నాగాయలంక, నూజివీడు, ఉంగుటూరు, విస్సన్నపేట ఎంపీడీఓలు గైర్హాజరయ్యారు. అసంతృప్తి చెందిన జడ్పీ సీఈఓ సలాం వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని- లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ సబ్​ కలెక్టర్ కార్యలయంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, పీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే 2 వారాల కార్యచరణపై ప్రధానంగా చర్చించారు. ముసునూరు, చాట్రాయి, ఎ.కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు, చందర్లపాడు, బాపులపాడు, నందిగామ, విస్సన్నపేట, గంపలగూడెం వంటి మెట్ట మండలాల్లో భూగర్భ జలాల మట్టం అడుగంటిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా 'నీటి పొదుపు- ప్రజల భాగస్వామ్యం' వంటి విషయాలపై ఈ సమావేశం జరిగింది.

Intro:తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. గంట సమయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు తిరుమాడ విధులు జలమయమయ్యాయి. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వర్షంలో తడుస్తూ గదులకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.