కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ మండిపడ్డారు. గత 3 నెలల్లోనే 225 రూపాయలు పెంచి సామాన్యుడి బ్రతుకు మీద దెబ్బకొట్టారని ఆయన వాపోయారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ముకాస్తుందన్న ఆయన...పేదలకు బ్రతికే అవకాశం లేకుండా చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పేద, మధ్యతరగతి వారు కడుపు నిండా తినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "పేదవారిని కొట్టు- పెద్దవారికి పెట్టు" అన్న పద్దతిలో సాగుతున్న భాజపా తీరుతో ప్రజలు విసిగిపోయారని...త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని శైలజానాథ్ అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి