కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో సీనియర్ పాత్రికేయుడు మట్టా పితాజీ మృతిచెందారు. కరోనా సోకడంతో ఈనెల 5వ తేదీన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చేరిన ఆయన… 4రోజుల తరువాత మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 14రోజులపాటు ఆసుపత్రిలో పోరాడిన ఆయన ఈ రోజు మరణించారు. పితాజీ మరణం పాత్రికేయ రంగానికి ఆయన తీరనిలోటని.. దివిసీమ మరో పాత్రికేయుడిని కోల్పోవడం దురదృష్టకరమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కేవి.సుబ్బారావు, తహసీల్దార్ టి.చంద్రశేఖర నాయుడు, ఎస్ఐ టీ.రామకృష్ణ తదితరులు పితాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలి బుద్ధప్రసాద్, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ పది వేల చొప్పున పితాజీ కుటుంబసభ్యులకు అందజేశారు.
ఇదీ చూడండి. బ్లాక్ ఫంగస్ కలవరం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ధారణ