ETV Bharat / state

5 లక్షల మంది వయోపౌరుల్లో టీకా వేయించుకున్నది 23 వేల మందే

కరోనా టీకా వేయించుకునేందుకు కృష్ణా జిల్లాలోని వృద్ధులు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు కొందరు ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకున్నా.. అందరు ఆరోగ్యంగానే ఉన్నారు. అయినా టీకా అపోహాలతో ముందుకు రాకపోవడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతుంది.

covid vaccination for senior citizens
5 లక్షల మంది వయోపౌరుల్లో టీకా
author img

By

Published : Mar 21, 2021, 12:46 PM IST

కృష్ణా జిల్లాలో 60 ఏళ్లు దాటిన వారు ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కొవిడ్‌ టీకాను కేవలం 23వేల మంది మాత్రమే వేయించుకున్నారు. జిల్లాలో కొవిడ్‌ టీకాను 146 ప్రభుత్వ, 44 ప్రైవేటు వైద్య కేంద్రాల్లో వేస్తున్నారు. రోజుకు కనీసం పది నుంచి 20వేల మందికి టీకాలను వేయాలని ఏర్పాట్లు చేశారు. 60ఏళ్లు దాటిన సాధారణ పౌరులకు మార్చి నెల ఆరంభం నుంచి కొవిడ్‌ టీకాను వేస్తున్నారు. ఇప్పటికి 20 రోజులు గడుస్తోంది. టీకాపై ఏర్పడిన అపోహల నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వయోపౌరులు ముందుకు రావడం లేదు. జిల్లాలో వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో వందేళ్లు దాటినోళ్లు కూడా ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురుకావనే విషయంపై జిల్లా యంత్రాంగం మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.

కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు 1,32,510 మంది కొవిడ్‌ వాక్సిన్‌ను వేయించుకున్నారు. వీరిలో మొదటి, రెండు దశల్లో టీకా వేసుకున్న ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల మంది వరకు టీకా వేయించుకునేందుకు వస్తున్నారు. వీరిలో రెండో విడత టీకా కోసం వస్తున్న ఆరోగ్య, ఇతర సిబ్బందే అధికంగా ఉంటున్నారు. 60 ఏళ్లు దాటిన వాళ్లు చాలా తక్కువ మందే వస్తున్నారు. వీరు శుక్రవారం ఉదయం వరకు 23,185మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. టీకా వేసుకున్నాక.. వీరెవరికీ ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు.

వయో పౌరులందరినీ తప్పనిసరిగా టీకా..

45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు కూడా నామమాత్రంగానే ముందుకొచ్చి టీకాను వేయించుకుంటున్నారు. జిల్లాలో 45 నుంచి 59 ఏళ్ల మధ్యలో వయసున్న వారు సుమారు 13లక్షల మంది ఉన్నారు. వీరిలో రక్తపోటు, మధుమేహం సహా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు కనీసం 20 నుంచి 30శాతం పైగానే ఉంటారు. అంటే 2.5లక్షల నుంచి 4లక్షల మంది ఏదో ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఏ చిన్న అనారోగ్య సమస్య ఉన్నా పర్వాలేదు.. వచ్చి టీకా వేసుకోమంటూ అధికారులు సూచిస్తున్నారు. కానీ.. వీరిలో ఇప్పటివరకు కేవలం 8,851మంది మాత్రమే కొవిడ్‌ టీకాను వేసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారు ముందుకు రాకపోవడంతో అధికారులు సచివాలయాల బాట పట్టారు. ఒక్కో సచివాలయాన్ని ఎంపిక చేసి.. దాని పరిధిలో ఉండే వయో పౌరులందరినీ గుర్తించి తప్పనిసరిగా టీకాలను వేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, మైలవరంలోని చంద్రగూడెం సచివాలయాలను ట్రయల్‌ రన్‌ కోసం ఎంపిక చేశారు. రెండు చోట్ల ఒక రోజులో 1100మందికి పైగా టీకాలను వేశారు.

ఇదీ చదవండి:

వయసులో అమ్మ... వృద్ధాప్యంలో నువ్వెవరమ్మా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.