ETV Bharat / state

వివిధ రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

వివిధ రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పలువురు నిందితులపై కేసు నమోదు చేశారు.

Seized of liquor smuggled from various states
వివిధ రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
author img

By

Published : Aug 28, 2020, 8:49 AM IST

చిత్తూరుజిల్లాలోని పుంగనూరు - పెద్దపంజాణి మండలాల సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 1,215 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక కారు, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గోపీచంద్​రెడ్డి , పృథ్వీ, వెంకటేశ్వర్లు కర్ణాటక మద్యాన్ని కారులో తరలిస్తూ పట్టుబడ్డారు. వాహనాన్ని, మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రామసముద్రం మండలంలో మరో 1300 బాటిళ్లను, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ శివారులో పోలీాసు తనిఖీలు నిర్వహించారు. బీదర్ నుంచి చిలకలూరిపేటకు మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 తెలంగాణ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. లక్షల ఖరీదు చేసే 75 బస్తాల గుట్కా ప్యాకెట్ల బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగళూరు నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్నకర్ణాటక మద్యం 39 సీసాలను నెల్లూరు జిల్లా వరికుంటపాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. స్టేషన్ వద్ద రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ... ద్రాక్ష పండ్ల లోడులో మద్యాన్ని పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా గుడివాడలో అక్రమంగా నిల్వ ఉంచిన 918 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్​ మెన్ గా పనిచేస్తున్న రాజేష్, సూపర్​వైజర్ సాయి శరత్.. సోమేశ్వర రావు అనే వ్యక్తికి 918 వివిధ రకాల మద్యం సీసాలను ఇచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు .ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న శరత్, రాజేష్ లను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని అన్నారు.

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం హావాలిగి సమీపంలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. విడపనకల్ మండలం హావాలిగి గ్రామం వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు సంచుల్లో మద్యాన్ని తరలిస్తుండగా.. తమ రాకను గుర్తించిన నిందితులు మద్యం వదిలేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు. దాదాపు 1536 టెట్రా పాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యాంప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి. ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.