అంతర్వేది దేవాలయంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఆలయ కమిటీతో పోలీసులు సమావేశం నిర్వహించారు. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించారు.
తిరుపతమ్మ ఆలయ రథం చుట్టుపక్కల బారికేడ్లు, ఆలయ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాల ఫుటేజ్ మానిటరింగ్ చేసేందుకు కమాండ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
ఇవీ చూడండి: