ETV Bharat / state

క్రీడా సంఘాల ఏర్పాటులో రాజకీయం తగదు.. కేపీ రావు - ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు

Andhra Pradesh Olympic Association : పోటీ సంఘాలు ఏర్పాటు చేసి క్రీడా స్ఫూర్తిని అవమానించొద్దని ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు విజ్ఞప్తి చేశారు. కొంతమంది సంఘాల పేరిట క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తూ.. అది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్కే పురుషోత్తం అనే వ్యక్తి రైవిల్ సంఘాలు పోటీగా ఏర్పాటు చేస్తూ కోర్టులు తీర్పులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం
ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం
author img

By

Published : Apr 7, 2023, 4:28 PM IST

Andhra Pradesh Olympic Association : కొంతమంది పోటీ సంఘాలు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు ఆరోపించారు. ఆర్కే పురుషోత్తం అనే వ్యక్తి రాజకీయ పలుకుబడితో దొంగ సంఘాలు రిజిస్టర్ చేస్తున్నారని తెలిపారు. ఆర్కే పురుషోత్తం ధర్మాన కృష్ణదాస్ అండతో రెచ్చిపోతున్నారని విమర్శించారు. వాళ్ల సంఘానికి కోర్టు గుర్తింపు ఇవ్వకపోయినా నాయకులుగా చలామణీ అవుతున్నారన్నారు.

డబ్బు మళ్లించడం అసాధ్యం.. ఒక సంఘంలో ఉన్న డబ్బులు, ఆస్తులు మరొక సంఘం పేరుతో మార్పు అవ్వవని కేపీ రావు తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్స్ సంఘానికి ఎన్నికలు జరిగాయన్న ఆయన... వాటిని ఆర్కే పురుషోత్తం పక్కన పెట్టేశారని వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులను లెక్క చేయడం లేదని పేర్కొన్నారు. కొన్ని క్రీడా సంఘాలు క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని చెప్తూ.. అది సరి కాదని అన్నారు. పురుషోత్తం రైవిల్ సంఘాలు పోటీగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదని, ఎవరైనా సరే న్యాయస్థానాల తీర్పులకు కట్టుబడి ఉండాలని కేపీ రావు తెలిపారు.

రాష్ట్రంలో క్రీడారంగంలో వివాదాలు, పరిణామాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. 1961లో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ ఏర్పాటై.. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్​కు అనుబంధంగా పనిచేస్తోంది. మా సంఘానికి 2015 సంవత్సరం నుంచి 50 లక్షల రూపాయల ఫిక్స్​డ్ డిపాజిట్లతో పాటు హైదరాబాద్​లో ఐదంతస్తుల భవనం కూడా ఉంది. అయితే, కొంత మంది రైవిల్ సంఘాలు పెట్టుకుని ఫిక్స్​డ్ డిపాజిట్లను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వారికి ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు రాదు. మాకు అనుబంధ సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్కే పురుషోత్తం అనే వ్యక్తి వీటన్నింటి వెనుక కారకుడు. మద్రాస్ కు చెందిన ఆ వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఎవ్వరూ కూడా ఆయన మాటలకు మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, ఐఓఏ గుర్తింపు కూడా లేకుండా సంఘాల ఏర్పాటుకు ప్రయత్నించడం విడ్డూరం. ఒలంపిక్ ఆస్తులు, ఫిక్స్​డ్ డిపాజిట్లు వాడుకోవాలను కోవడం చట్ట పరంగా సాధ్యం కాదు. ఆ విషయం ముందుగా తెలుసుకుంటే మంచిది. మీడియా మిత్రులు వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగ సంఘాలు ఏర్పాటు చేసి చాటుమాటు కార్యకలాపాలు చేయడం సరికాదు. క్రీడా సంఘాల్లో వివాదాలు సృష్టించ వద్దని కోరుతున్నాం. క్రీడా రంగ అభివృద్ధికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్తాం. - కేపీ రావు, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.