ETV Bharat / state

ప్రతి అంశంలో రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు: వెంకట్రామిరెడ్డి

author img

By

Published : Jan 18, 2022, 2:12 PM IST

Updated : Jan 18, 2022, 3:44 PM IST

వెంకట్రామిరెడ్డి
వెంకట్రామిరెడ్డి

14:08 January 18

పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి: సచివాలయ ఉద్యోగుల సంఘం

Venkatram Reddy on DA and PRC fitment: ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్‌ తక్కువైనా మిగిలిన విషయాల దృష్ట్యా అప్పట్లో అంగీకరించామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు.ప్రతి అంశంలో రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల సాధనకు అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

"గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవు.అధికారుల కమిటీని మొదటి నుంచి వ్యతిరేకించాం. హెచ్‌ఆర్‌ఏ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలో సీఎంకు చెప్పాం. ప్రభుత్వం జారీచేసిన జీవోలను ప్రతీ ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారు. కొన్ని అంశాల్లో రాజీకి మేం సిద్ధమే. ప్రతి అంశంలో రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి.ఉమ్మడి వేదికపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధం. ఇవాళ సాయంత్రం సీఎం అపాయింట్‌మెంట్‌ కోరుతున్నాం. భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ భేటీ అవుతాం" - వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

సోమవారం ఉత్తర్వులు...

EMPLOYEES DA: 2019 జులై 1 తేదీ నుంచి 5శాతం కరవు భత్యం బకాయిలను చెల్లింపునకు రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనం తో కలిపి ఇచ్చే డీఏ కూడా కలిసి ఉన్నట్టు ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. డీఏ బకాయిలు సాధారణ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోను, సీపీఎస్ ఉద్యోగుల పిఆర్​ఏఎన్ ఖాతాలకు జమ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2019 జూలై 1 తేదీ నుంచి 2021 డిసెంబరు 31 తేదీ వరకూ ఉన్న 5 శాతం డీఏ బకాయిలనూ 2022 జనవరి వేతనంతో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలియచేసింది.

ఇదీ చదవండి:

ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం: ఉద్యోగ సంఘాలు

Last Updated : Jan 18, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.