వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని కర్నూలులో జిల్లాలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే మంచి పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్ధతు ఉంటుందన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకొని... క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లాలో 6లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా... 39 వేల మందికి కంటి సమస్యలున్నాయని వివరించారు.
కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. విజయవాడ బిషప్ అజరయ్య పాఠశాలలోని స్క్రీనింగ్ సెంటర్లో పరీక్షల నిర్వహణను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 4 వేల 400 పాఠశాలల్లో 5 లక్షల 65 వేల మందికి తొలివిడతలో కంటి పరీక్షలు జరిపారు. 42 వేల 600 మంది విద్యార్థులకు రెండో విడతలో పరీక్షలు చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాలో 372 స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: "ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం"