ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. గాంధీ సంకల్ప యాత్ర సందర్భంగా కర్నూలులోని కల్లూరు చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. సర్ధార్ వల్లభాయ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ డిక్లరేషన్‌కు భాజపా కట్టుబడి ఉందని వెల్లడించారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ, తుంగభద్ర జలాలు రాయసీమకే చెందాలని డిమాండ్ చేశారు.
"ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం" - ఏపీ రాజధానిపై టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు
భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా కృష్ణ, తుంగభద్ర జలాలు రాయలసీమకే చెందాలని అన్నారు.
!["ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4924136-109-4924136-1572541758521.jpg?imwidth=3840)