ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ను ఎక్కడ వేసుకున్నారో.... రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. మొదటి డోస్ తీసుకున్న వారు.. 28 రోజుల విరామం తర్వాత రెండో డోస్ వేసుకోవాలని ఆ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
ఫిబ్రవరి 13 నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ మొదలవుతుందని చెప్పారు. ఈ నెల 25 తర్వాత హెల్త్ కేర్ వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బందికి మొదటి విడత వ్యాక్సినేషన్ ముగిసిపోతుందని.. ఇతర శాఖల సిబ్బంది మార్చి 5లోగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సి ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: