లాక్డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చే ప్రక్రియను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. వాహనదారులు భారీగా అక్కడకు చేరుకోవటంతో భౌతిక దూరం పాటించాలని సీపీ సూచించారు. విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని ఆదేశించారు.
అపరాధ రుసుము లేకుండానే వాహనాలు ఇస్తున్నామని... మళ్లీ తప్పు చేయకుండా వాహనదారుల నుంచి పూచీకత్తు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కింద సీజ్ చేసిన వాహనాలకు చలానా వేస్తామని వివరించారు. కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని... కంటైన్‌మెంట్ జోన్లు కానిచోట కరోనా కేసులు వస్తే ఆంక్షలు విధిస్తామని సీపీ స్పష్టం చేశారు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: