ETV Bharat / state

కోడూరు, నాగాయలంకలో ముగిసిన 'సీ విజిల్-21' - నాగాయలంక సముద్ర తీరంలో ముగిసిన సీ విజిల్ 21

విశాఖపట్నం కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో.. కోడూరు, నాగాయలంక మండలాల్లోని సముద్ర తీరాల వెంట 'సీ విజిల్-21' నిర్వహించారు. ఈనెల 12, 13న జరిగిన ఈ కార్యక్రమంలో.. సముద్రంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే విన్యాసాలు చేశారు. 26/11 తరహా దాడులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఏటా రెండుసార్లు వీటిని నిర్వహిస్తున్నారు.

sea vigil 21 in avanigadda, nagayalanka
అవనిగడ్డ, నాగాయలంకల్లో ముగిసిన సీ విజిల్ 21
author img

By

Published : Jan 15, 2021, 7:36 PM IST

'సీ విజిల్‌-21'లో భాగంగా.. సముద్రంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని సమర్థంగా ఎదుర్కొనే విధానంపై ట్రోపెక్స్‌ పేరిట ఈనెల 12, 13 తేదీల్లో విన్యాసాలు నిర్వహించారు. విశాఖపట్నం కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో.. కోడూరు, నాగాయలంక మండలాల్లోని సముద్రతీర ప్రాంతం వెంబడి ఈ కార్యక్రమం జరిగింది. తీరప్రాంత గ్రామాలను పోలీస్ సిబ్బంది జల్లెడ పట్టారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు తారసపడితే వెంటనే ఆధీనంలోకి తీసుకున్నారు. సముద్రంలో గస్తీ నిర్వహిస్తూ.. ఉగ్రవాద మూకల్ని అడ్డుకునే విధంగా విన్యాసాలు చేశారు.

ముంబయిపై 26/11 ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో.. మరోమారు ఆ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తీర ప్రాంతాల్లో ఏటా జనవరి, జూన్​లలో 'సీ విజిల్‌ - 21' కార్యక్రమం నిర్వహిస్తారు. 13 సముద్ర తీర రాష్ట్రాలు ఇందులో భాగస్వాములు. నేవీ, కోస్టుగార్డు, కస్టమ్స్‌, హోం ఎఫైర్స్‌, షిప్పింగ్‌, పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, ఫిషరీస్‌ విభాగాలు విన్యాసాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఏపీలో జరిగిన ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా వ్యవహరించారు. మెరైన్ సీఐ వల్లభనేని పవన్ కిషోర్, ఎస్సై నాయుడుతో పాటు 50 మంది పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.