తులసి చైతన్య... కృష్ణా జిల్లా విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం. మంచి జీతం. అయినా సంతృప్తి లేదు. ఇంకా ఏదో సాధించాలన్న ఆతృత. ఆ ఆరాటమే అతణ్ని ఈతలో మొనగాణ్ని చేసింది. సప్త సముద్రాలు దాటాలనుకున్న అతని లక్ష్యంలో... తొలి అడుగును విజయవంతం చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో భాగమైన 35 కిలోమీటర్ల క్యాటలీనా ఛానల్‌ను అవలీలగా ఈదేసి అరుదైన ఘనత సాధించాడు. మిగిలిన 6 సముద్రాలను అదే స్ఫూర్తితో ఈదేస్తానని చెబుతున్నాడు.
ఈతలో బాల్యం నుంచే చైతన్య ప్రతిభ చూపాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ఈ దిశగా పోలీసు శాఖ తనకు ప్రోత్సాహం ఇస్తోందని చెప్పాడు. వేసవి శిబిరంలో సాధారణ కుర్రాడిలా తమ దగ్గర శిక్షణ తీసుకున్న చైతన్య... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ అందని ఘనత సాధించాడంటూ... ఈత నేర్పిన గురువులు ఆనందిస్తున్నారు.
క్యాలిఫోర్నియా తీరం నుంచి.. క్యాటలినా ఛానెల్ ద్విపం వరకు ఉన్న 35 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల 40 నిముషాల్లో పూర్తి చేశాడు చైతన్య. అది కూడా 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో.. మిగతా 6 సముద్రాలు ఈదేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇవీ చదవండి: