కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామ సచివాలయంలో అమానుషం జరిగింది. జగనన్న చేదోడు పథకం రాలేదని అడిగినందుకు.. గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ అమానుషంగా దాడి చేశారని.. ఎస్సీ మహిళ నీలిమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది పథకానికి ఎంపికైన తాను.. ఈసారి ఎందుకు ఎంపిక కాలేదని ప్రశ్నించినందుకు తనపై దుర్భాషలాడాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మరోవైపు నీలిమ కుటుంబ సభ్యులే అకారణంగా తనపై దాడి చేశారని.. వెల్ఫేర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నారాయణ రెడ్డి ప్రవర్తన సక్రమంగా ఉండదని, గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శితోనూ గొడవలున్నాయని, గ్రామ వాలంటీర్లపై తరచూ దుర్భాషలాడతారనే ఆరోపణలున్నాయి. అతని నిర్లక్ష్యం కారణంగా.. గ్రామంలో 30 మంది పింఛన్లు నెలల తరబడి ఆన్లైన్ కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: FINANCE : ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖలో ముగిసిన భేటీ.. త్వరలోనే శుభవార్త వస్తుందన్న ఎంపీ..!