కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నెలరోజులుగా విజయవాడ ఇన్నర్ రింగ్ లింక్ రోడ్డుతో అనుబంధ గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు. దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న రైల్వే గేటు, చీమలవాగుపై కల్వర్టు నిర్మించాలని నిరసన వ్యక్తం చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం సత్వరమే సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కల్వర్టు నిర్మాణంపై అధికారులు చర్యలు చేపట్టకుంటే సీఎం వద్దకు వెళ్తామని హెచ్చరించారు. గ్రామానికి ఓ వైపు చీమలవాగు, మరో వైపు రైల్వే గేటు మూతతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:
Farmers Maha Padayatra: సోమవారం నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర