ETV Bharat / state

'ప్రజాప్రతినిధుల అండతో ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలింపు' - గుంటూరులో ప్రైవేటు వెంచర్లకు అక్రమంగా మట్టి తరలింపు

ప్రభుత్వ భూముల్లో మట్టి కనబడితే చాలు గుట్టు చప్పుడు కాకుండా కొల్లగొడుతున్నారు. ప్రజాప్రతినిధుల అండ ఉంటున్న కారణంగానే... ఇష్టా రాజ్యంగా మట్టి తొలగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల లేఔట్ల అభివృద్ధికి అనుమతులు తీసుకుని... ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

sand is transferred illegally to private ventures in krishna and guntur districts
'ప్రజాప్రతినిదుల అండతో ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలింపు'
author img

By

Published : Sep 10, 2020, 6:08 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం టి.గుడిపాడు పరిధిలో అనుమతి లేకుండా మట్టి రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మట్టి రవాణా కొందరికి ఆదాయ వనరుగా మారి.. ఇష్టానుసారంగా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

గుంటూరులో..

గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడెపురంలో అధికార పార్టీ నేత ఒకరు ఇళ్ల స్థలాల కోసం మట్టి తీసుకెళ్లటానికి అనుమతి తీసుకొని... ప్రైవేటు వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులకు తరలిస్తూ... పెద్ద ఎత్తున్న సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రి, పగలు తేడలేకుండా 5 ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగులకు పైగా తవ్వకాలు చేస్తూ.. ఒక్కొక్క టిప్పర్ మట్టి నింపడానికి రూ.3వేలు, ఒక్కో ట్రాక్టర్ కు రూ.600 చొప్పున సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.

స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు పరిశిలించారు కానీ... తవ్వకాలకు అనునతి ఉందంటూ వెనక్కి వెళ్లారు. ఒక ప్రజా ప్రతినిధికి ప్రధాన అనుచరుడు అయిన కారణంగా.. రెవిన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

తాడికొండ తహలసీల్దార్ కుటుంబరావును ఈ విషయమై వివరణ కోరగా... ఇళ్ల స్థలాల అభివృద్ధికి మట్టి తవ్వకాలకు బడెపురంలోని కొండ వద్ద అనుమతులు ఇచ్చామన్నారు. ప్రైవేటు వెంచర్లకు మట్టిని తరలిస్తున్న రని తమ దృష్టికి రాలేదని తెలిపారు. అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని గనుల శాఖ సహాయ చంచాలకుడు విష్ణు వర్ధన్ తెలిపారు.

ఇదీ చదవండి:

'సరైన నిఘా లేనందునే మోసాలు జరుగుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.