ETV Bharat / state

రాష్ట్రంలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు - వాతావరణ విభాగం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్​ అధికారులు తెలిపారు. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయన్న ఆర్టీజీఎస్​... దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. గోదావరి, కృష్ణా నదులకు మళ్లీ వరదలు వచ్చే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ వర్ష సూచన
author img

By

Published : Sep 19, 2019, 12:57 PM IST

Updated : Sep 19, 2019, 2:00 PM IST

రాష్ట్రంలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్​ తెలిపింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయన్న ఆర్టీజీఎస్​ అధికారులు... దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

నదులకు మళ్లీ వరదలు

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కృష్ణా, గోదావరి నదులకు మళ్లీ భారీగా వరద వచ్చే అవకాశం ఉందని ఆర్టీజీఎస్​ తెలిపింది. ఈ నెల 21 నుంచి అక్టోబర్​ 2 వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ... 28 నుంచి అక్టోబర్​ 4 వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద చేరుతుందని ఆర్టీజీఎస్​ అధికారులు తెలిపారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి : పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

Last Updated : Sep 19, 2019, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.