ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో ప్రగతి రథ చక్రాలు తిరిగేనా..! - టీఎస్​ఆర్టీసీ సర్వీసులు

ఆ మార్గాల్లో నిరంతరం లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్ సహా పలు పలు మార్గాల్లో నిత్యం వేల వాహనాలు వీరిని చేరవేస్తుంటాయి. రద్దీ రోజుల్లో రెండు రాష్ట్రాల ఆర్టీసీలు సహా వేల ప్రైవేటు బస్సులు రోడ్డెక్కినా బస్సులు సరిపోని పరిస్ధితి ఉంటుంది. ఇలాంటి కీలక మార్గంలో లాక్ డౌన్ తో సర్కారు బస్సు చక్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దేశమంతా అన్ లాక్ ప్రారంభమై మూడునెలలు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం ఇంకా ప్రగతి రథ చక్రాలు రోడ్డెక్కలేదు. నెలలు గడుస్తున్నా ఇదే పరిస్ధితి. ఎప్పటికి సాధారణ పరిస్ధితి వస్తుందో తెలియదు. కొద్ది పాటి ప్రైవేటు వాహనాలు రోడ్డెక్కినా చార్జీల భారంతో మోయలేని దుస్ధితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఎప్పుడు పరుగులు పెడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అనిశ్చితి ఎప్పుడు తొలగుతుందని ప్రయాణికులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Rtc survives in Telugu states
Rtc survives in Telugu states
author img

By

Published : Sep 15, 2020, 5:21 AM IST

Updated : Sep 15, 2020, 1:53 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు సాగించడంపై నెలకొన్న అనిశ్చితి నెలల తరబడి కొనసాగుతోంది. కరోనాతో మార్చి 22న లాక్ డౌన్ ప్రారంభంతో నిలిచిన ఆర్టీసీ బస్సులు నేటి వరకూ తిరిగి రోడ్డెక్కలేదు. మే 22 నుంచి పొరుగు రాష్ట్రాల్లోని పలు రాష్ట్రాలుకు ఎపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్దరించినా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ప్రారంభించలేదు. తమ భూభాగంలో ఎపీ బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్రం అనుమతించకపోవడమే దీనికి ప్రధాన కారణం. రూట్ వారీగా కిలోమీటర్లు లెక్కన పరస్పరం ఒప్పందం చేసుకోవాలని రెండు నెలలక్రితమే ప్రాథమికంగా అంగీకరించారు. దీంతో త్వరలోనే బస్సులు నడుస్తాయని తమ కష్టాలు తీరతాయని రెండు రాష్ట్రాల్లోని ప్రయాణికులు ఆశించారు. కిలోమీటర్లు లెక్కపై పీటముడి పడటం, ఇరువురూ ఎంతకూ దిగిరాకపోవడంతో ఒప్పందం ప్రక్రియ నిలిచిపోయింది.నెలలు గడుస్తున్నాయి.. ఎప్పటికి బస్సులు రోడ్డెక్కుతాయో తెలియని పరిస్ధితి నెలకొంది.

అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవడంలో పీటముడి నెలకొనడమే ఈ పరిస్ధితికి కారణం. రాష్ట్ర విభజన ముందు నుంచీ ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 3.43 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏపీలోకి 95 వేలు కిలో మీటర్లు బస్సులు తిప్పుతుంది. 2019 వరకు ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే బస్సులు తిప్పవచ్చుకోవచ్చని విభజన చట్టంలో ఉన్న నిబంధన మేరకు ఇరువురూ బస్సులు తిప్పారు. గడువు తీరడంతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని అప్పటి వరకు ఏపీ బస్సులకు అనుమతించబోమని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు ఒప్పందం కోసం ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు రెండు సార్లు చర్చలు జరిపారు. అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాలూ రూట్ వారీగా సమాన కిలోమీటర్లు బస్సులు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలూ బస్సులపై పరస్పరం పన్ను మినహాయింపులు ఇచ్చుకుంటాయి. తమ రాష్ట్రంలో తిరిగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల కిలోమీటర్లు తగ్గించాలని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రధానంగా కోరుతోంది. కిలోమీటర్లు తగ్గించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. 3.43 లక్షల కి.మీ నుంచి 2. 65 లక్షల కి.మీ.కు తగ్గించేందుకు సమ్మతించారు. మరో 55వేల కి.మీ తగ్గించేందుకు సిద్దమని తెలిపారు. దీంతో ఏపీకి నడిపే బస్సులు 95 వేల నుంచి 1.5 లక్షల కిలో మీటర్లకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు పెంచారు. మరో 50 వేల కిలోమీటర్లకు తిప్పాల్సి ఉన్నా తమ వద్ద కొత్తబస్సులు లేని కారణంగా అంతకు మించి బస్సులు నడపలేమని స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న రూట్లో రెండు రాష్ట్రాలూ సరిపడ బస్సులు నడపని పక్షంలో మధ్యలో ప్రైవేటు వారు లాభపడతారని అలా జరగనివ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఏపీ అధికారులు స్పష్టం చేశారు.

ఇరు రాష్ట్రాలూ పరస్పరం ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనికి టీఎస్ ఆర్టీసీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో చర్చల్లో చాలారోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బస్సు భవన్​లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఉభయులూ నష్టపోకుండా బస్సులు నడుపే మార్గాలను అన్వేషించి చర్చించనున్నారు. అన్ లాక్ ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు రాకపోకలు ప్రారంభం కాకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ అధికారులు ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్, టాక్సీలు ప్రారంభమైనా డిమాండ్ దృష్ట్యా అధిక చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు కష్టాలు పడుతున్నారని వివరించనున్నారు. తాము ఎంత మేర బస్సులు తిప్పుతామో.. అంతే స్థాయిలో బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులను మరోసారి కోరనున్నట్లు తెలిపారు. అంగీకరించని పక్షంలో ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి 72వేల కిలో మీటర్లు నడిపేందుకు తాత్కాలిక అనుమతి ఇవ్వాలని తెలంగాణ ని కోరనున్నట్లు ఏపీ అధికారులు తెలిపారు.

ఏపీలో పలు ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను విజయవాడ, కర్నూలు వరకే నడిపాలని.. అక్కడి నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బస్సుల్లో సమాన బస్సుల్లో రాకపోకలు సాగిద్దామని తెలంగాణ అధికారులు తాజాగా ప్రతిపాదన తెచ్చారు. వీటిపై ఏపీ అధికారులు చర్చించనున్నారు. ఎండీ స్థాయిల్లో జరిగే కీలక చర్చలు సఫలమైతే అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు పరుగులు పెట్టనున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీల రథ చక్రాలు ఇప్పట్లో రోడ్డెక్కుతాయా లేదా అనేది మరికాసేపట్లో

ఇదీ చదవండి: ప్రతిధ్వని : పార్లమెంట్ సమావేశాలు... కీలక బిల్లులు!

Last Updated : Sep 15, 2020, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.