సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు ఆది, సోమవారాల్లో మెుత్తం 2,494 ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ రెండురోజుల్లో కేవలం హైదరాబాద్ కు 631 బస్సులు వేశారు.
ఆదివారం హైదరాబాద్ కు 359, వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 59, విశాఖకు 125, బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులను అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. సోమవారం కూడా మెుత్తం 540 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఆయా మార్గాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) బ్రహ్మనందరెడ్డి తెలిపారు. మంగళ , బుధవారాల్లో అవసరమైతే అదనపు బస్సులు కొనసాగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
కొవిడ్ టీకా సురక్షితం: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్