ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి కృష్ణా జిల్లా కంచికచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద ట్రాక్టర్‌పై వెళ్తున్న తండ్రీ, కొడుకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17 సంవత్సరాల షేక్ అక్బర్ అక్బర్ మృతి చెందగా, తండ్రి జాన్ సైదాలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని వెంటనే నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ షేక్ అక్బర్ మృతి చెందాడు. అక్బర్ మృతిచెందాడన్న విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడ వారందరనీ కంట తడిపెట్టేలా చేసింది.ఇదీ చదవండి : పాము కాటుకు మరో మహిళ మృతి