కృష్ణా జిల్లాలో కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని 55 ఆస్పత్రులకు ఇప్పటీవరకు రూ.4 కోట్ల జరిమానాలు విధించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ ప్రత్యేక బృందాలు ఆస్పత్రులను నిరంతరం పరిశీలిస్తాయన్నారు. విజయవాడలోని గాయత్రి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ప్రభుత్వం విధించిన ధరలకు కొవిడ్ వైద్యం చేయాలని పాలనాధికారి స్పష్టం చేశారు. రోగుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయితే తీసుకున్న నగదుకు పది రెట్లు అదనంగా జరిమానా విధించి సదరు ఆస్పత్రి యాజమాన్యాల నుంచి రాబడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు మానవతా ధృక్పథంతో వైద్య సేవలు అందించాలని కోరారు.
Anandaiah: ఔషధ పరీక్షలపై రేపే చివరి నివేదిక: ఆయుష్ కమిషనర్