అవనిగడ్డ సబ్ డివిజన్లో 64 మందిపై రౌడీషీట్ ఎత్తివేత - అవనిగడ్డ సబ్ డివిజన్లో 64 మంది పై రౌడీషీట్ ఎత్తివేత
కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 64 మందిపై రౌడీషీట్లను ఎత్తివేశారు. మంచిగా జీవించాలని.. నేరాలకు పాల్పడితే తిరిగి వాళ్లపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ రమేష్‌రెడ్డి హెచ్చరించారు. 8 ఏళ్ల నుంచి వీరు సత్పవర్తనతో ఉన్నారని ఆయన చెప్పారు. సబ్‌డివిజన్ పరిధిలో మరో 345 మందిపై రౌడీ షీట్ ఉందన్నారు. వీరు సత్ప్రవర్తనతో మెలిగితే ఈ ఏడాది డిసెంబర్లో వారిపై రౌడీషీట్లు ఎత్తివేసేందుకు సిఫార్సు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, అవనిగడ్డ ఎస్సై -1 సందీప్, అవనిగడ్డ ఎస్సై-2 సురేష్, కోడూరు ఎస్సై రమేష్, చల్లపల్లి ఎస్సై నాగరాజు పాల్గొన్నారు
ఖైదీలతో మాట్లాడుతున్నడీఎస్పీ రమేష్ రెడ్డి
By
Published : Mar 1, 2020, 1:00 PM IST
..
అవనిగడ్డ సబ్ డివిజన్లో 64 మంది పై రౌడీషీట్ ఎత్తివేత