రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. వేలాది ఉద్యోగులను తరలించడం, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని కోరారు.
ఇదీ చదవండి: