ఇవీ చదవండి.
ఆంధ్రాకు వచ్చిన అమెరికా రోడ్లు....!
అమెరికా రోడ్లు ఆంధ్రాకి వచ్చేశాయి. మొట్టమొదటిసారిగా కృష్ణాజిల్లా గన్నవరంలో అమెరికా సాంకేతికతను ఉపయోగించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సాంకేతికతతో వ్యయం సగానికి సగం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
అమెరికా సాంకేతికతతో ఆంధ్రా రోడ్లు
కృష్ణా జిల్లా గన్నవరంలో మొట్టమొదటిసారిగా అమెరికా సాంకేతికతను ఉపయోగించి రహదారి నిర్మాణం చేపట్టారు. టెర్రాపేవ్ అనే ద్రవరూపంలో ఉండే పదార్థాన్ని ఉపయోగించి రోడ్డు వేశారు. కంకర, గ్రావెల్, సిమెంట్, ఇసుకతో పనిలేకుండా మట్టిని రోటవేటర్ యంత్రాలతో గుల్ల చేసి ఆపై ఈ ద్రవ పదార్థాన్ని చల్లి రోలింగ్ చేస్తారు. ఎన్టీఆర్ రోడ్డు నుంచి మర్లపాలెం వరకు 2 కిలోమీటర్లకు కేవలం 35 లక్షల రూపాయల ఖర్చుతో రోడ్డు నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ పదార్థం ఉపయోగించడం వలన సగానికి సగం ఖర్చు తగ్గుతుందని అధికారులు తెలిపారు. దీనివలన రోడ్డు నాణ్యత పెరుగుతుందని.. 35 సంవత్సరాల వరకు పాడవ్వదని చెప్పారు. పంచాయతీరాజ్ ముఖ్య అధికారి వెంకటేశ్వరరావు, అమెరికా ప్రతినిధి గ్యారీ విల్సన్ తదితరులు నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
ఇవీ చదవండి.
sample description