తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పార్టీ పగ్గాలు అందుకున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, సీనియర్ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, కొత్త కార్యవర్గ సభ్యులు సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇందు కోసం ఉదయమే ఇంటినుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు. ముందుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి(peddamma thalli) గుడికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా గాంధీభవన్‌కు పయనమయ్యారు. మార్గమధ్యలో నాంపల్లి యూసుఫైన్ దర్గాలో రేవంత్ రెడ్డి ప్రార్థనలు చేశారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్నారు.
ఇదీ చూడండి: schools reopen: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..!