కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజారును ఆర్డీఓ శ్రీని కుమార్, డీఎస్పీ సత్యానందం, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించి.. వాటి ప్రకారమే అమ్మాలని సూచించారు. కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించాలని కోరారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని.. నిత్యావసరాల కోసం వచ్చినా వెంటనే పని ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా ఉండి కరోనా వైైరస్ వ్యాప్తి కట్టడికి కృషి చేయాలన్నారు.
ఇవీ చదవండి.. రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు