కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న చౌక ధరల దుకాణం డీలర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతవరంలోని రేషన్ షాప్ నుంచి 12 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొజ్జగని కొండలరావు ,ప్రభు, లారీ డ్రైవర్ బొండాల నాగేశ్వరావు, లారీ ఓనర్‌పై కేసు నమోదు చేశామని నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. బియ్యాన్ని నందిగామ డిప్యూటీ తహసీల్దార్‌కి అప్పగించారు.
ఇవీ చదవండి..