కృష్ణా జిల్లా ధర్మవరప్పాడులోని రామ్‌కో - ఎల్ అండ్ టీ పరిశ్రమ వలస కార్మికుల పోరాటం ఫలించింది. సుమారు 1500 మంది కార్మికులను స్వరాష్ట్రాలకు పంపే కార్యక్రమం మొదలైంది. తొలుత ఝార్ఖండ్‌కు చెందిన 600 మందిని 19 బస్సుల్లో రైల్వేస్టేషన్‌కి తరలించారు. ఇంకో 900 మందిని రెండు రోజుల్లో తరలిస్తామని అధికారులు తెలిపారు.
స్వస్థలాలకు వెళ్తున్న వారికి మిగిలినవారు సంతోషంగా వీడ్కోలు పలికారు. ఇక.. 50 రోజుల నిరీక్షణతో విసిగిపోయిన కార్మికులు కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. అందులో భాగంగా 2 రోజుల క్రితం సీఐ నాగేంద్రను కూడా నిర్బంధించారు. ఎట్టకేలకు తమ ఆకాంక్ష నెరవేర్చడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: