ETV Bharat / state

RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపుప్రాంతాలలోకి ఎన్డీఆర్​ఎఫ్ బృందాలను ప్రభుత్వం పంపించింది. పంటలన్నీ నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 50 కి.మీ.వేగంతో గాలులు వీయనున్నాయి.

rain in ap
రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు
author img

By

Published : Jul 23, 2021, 9:36 AM IST

Updated : Jul 23, 2021, 11:35 AM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని.. గంటకు 50 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు కోస్తా, రాయలసీమల్లోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురవొచ్చని అన్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో..

గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం గ్రామం వద్ద వయ్యేరు కాలువ పొంగి ప్రవహిస్తోంది. గట్టును నివసిస్తున్న నివాస గృహాలలో నీరు చేరింది. భారీ వర్షాలకు ఎగువన కరాటం, కృష్ణమూర్తి, ఎర్ర కాలువ జలాశయం నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో వయ్యేరు కాలువకు వరద నీరు పోటెత్తుతోంది.

వంద మందికి పైగా బాధితులు నిరాశ్రయులయ్యారు. గట్టు పైభాగంలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని తలదాచుకుంటున్నారు. బాధితుల పరిస్థితి దృష్టిలో ఉంచుకొని పునరావాస కేంద్రాలకు తరలించనున్నట్లు మండల రెవెన్యూ అధికారి పీఎన్​డీ ప్రసాద్ తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా చిన్నంపేట- శివాపురం మధ్య అప్రోచ్‌ రహదారి కోతకు గురవడంతో ఆ మార్గంలో కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. చౌటపల్లి- జి.కొత్తూరు, పెనుగంచిప్రోలు- లింగగూడెం తదితర ప్రాంతాల్లో రాకపోకలు నిలిచాయి

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలో 438 హెక్టార్లలో నారుమళ్లు, 202 హెక్టార్లలో వరినాట్లు మునిగిపోయాయి. రామచంద్రపురం, అమలాపురం, కాకినాడ డివిజన్లలోనూ పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. జిల్లాలోని అన్ని డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు

అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు అమలాపురం డివిజన్​లో ఖరీఫ్ వరిపంట నీట మునిగింది. . జిల్లావ్యాప్తంగా 640 హెక్టార్ల విస్తీర్ణంలో పొలాలు ముంపు బారిన పడ్డాయి. ఈరోజు కూడా వాతావరణం మేఘాలతో ఉంది. రాగల 72 గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. పొలాలు నీటముగడంతో.. రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యు.కొత్తపల్లి ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతితో ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, మూలపేట, కోనపాపపేట గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

గోదావరిలో పెరిగిన వరద

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలకు మరింత వరద ముప్పు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8.5 అడుగుల నీటిమట్టం ఉంది. పంట కాల్వలకు 2 వేల క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. సముద్రంలోకి లక్షా 10 వేల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్నారు.

కృష్ణాజిల్లాలో..

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో మున్నేరులో వరద ఉధృతి భారీగా పెరిగింది. ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెన నీట మునిగింది. తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పెనుగంచిప్రోలు వద్ద వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటి మట్టం నమోదయ్యింది. 50 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది.

వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద కట్టలేరు వాగు వరద నీరు.. దేవినేని వెంకట రమణ వారధిపై ప్రవహిస్తుంది. దీంతో అటువైపు వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో వైరా - కట్టలేరు వాగు వరద ప్రవాహంలో మామిడి తోటలో కొంతమంది కాపలా దారులు చిక్కుకున్నట్లు సమాచారం. నందిగామ మండలం దాములూరు వద్ద ఆర్అండ్బీ రహదారిపై నుంచి వైరా కట్టలేరు వాగు వరద ప్రవహిస్తుంది. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి.

మున్నేరు ఉద్ధృతి
తెలంగాణ నుంచి వస్తున్న వరదకు మున్నేరు పొంగడంతో కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్టకు 17 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు- గుమ్మడిదుర్రు మధ్య కూటివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వెయ్యి ఎకరాలకు పైగా వరి నీట మునిగింది. తమ్మిలేరుకు వరద ఉద్ధృతి పెరిగింది. 2,500 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో పరిసర ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా మహానందిఫారం సమీపంలో పాలేరు వాగు పొంగడంతో దేవస్థానానికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. కోవెలకుంట్ల, ఆదోని, ఓర్వకల్లు ప్రాంతాల్లోనూ వరదనీరు ముంచెత్తింది.

ఎంతెంత వర్షపాతం

బుధవారంనుంచి ముసురు పట్టి ఎడతెరిపి లేని జల్లులు పడుతున్నాయి. బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం సాయంత్రం 7 గంటల మధ్య నూజివీడుతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 153, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 137, బాపులపాడు, విజయవాడల్లో 130, విస్సన్నపేటలో 116 మి.మీ చొప్పున వర్షం కురిసింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకోడేరు, కృష్ణా జిల్లా పాలేరు వంతెన, తిరువూరుల్లో 100 మి.మీ వరకు వర్షం కురిసింది. వరరామచంద్రాపురం, కూనవరం, పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, వేలేరుపాడు, భీమడోలు, మొగల్తూరు, గణపవరం, ఏలూరు, కృష్ణా జిల్లా గుడివాడ, జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా సత్తెనపల్లితోపాటు యానాం ప్రాంతాల్లో 50 మి.మీ నుంచి 69 మి.మీ మధ్య వర్షపాతం నమోదైంది. పోలవరం స్పిల్‌వే వద్ద 27.90మీ. నీరు పెరిగింది.

ఇదీ చూడండి. Water issue: ఆ పనులే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది: షెకావత్‌

Last Updated : Jul 23, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.