చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో అధికారుల సోదాలు - విజయవాడ జీఐడీ ఉద్యోగి ఇంట్లో సోదాలు
విజయవాడలో జీఐడీ ఉద్యోగి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ గతంలో చంద్రబాబు వద్ద పీఎస్‌గా పని చేశారు. ప్రభుత్వం మారటంతో ప్రస్తుతం మాతృసంస్థలో శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఏ విభాగం ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారో అధికారులు వెల్లడించటానికి నిరాకరించారు.