కోర్టు తీర్పు వచ్చే వరకు ఎస్ఈసీగా రమేశ్కుమార్నే కొనసాగించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికలపై రమేశ్‌కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలు గమనించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 356 అమలు దిశగా పయనించవద్దని సీఎం జగన్‌కు హితవు పలికారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దని సూచించారు.
"రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడానికి మన ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి లేదుఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. న్యాయస్థానాలను గౌరవిద్దాం, న్యాయవ్యవస్థ విలువను కాపాడదాం. న్యాయవ్యవస్థను కించపరుస్తున్న మా పార్టీ వారిపై మాత్రం కేసులు పెట్టడం లేదు. న్యాయవ్యవస్థను కించపరిచే వారిని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందేమోననే అనుమానం కలుగుతోంది. కేసుల రాజ్యం వద్దు.'
- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
కొద్దిమంది వ్యక్తులు ఇచ్చిన సలహాలతో అరువు విమానంలో దిల్లీ వచ్చారని.. తనను అనర్హుడిగా చేయాలని రాజ్యాంగంపై అవగాహన లేని వ్యక్తులు తన మీద ఫిర్యాదు చేస్తే ఏమౌతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వానికి సూచన చేయడమే తన తప్పా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం.. రఘురామను తప్పించండని దిల్లీ వెళ్లి వేడుకున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థను దుర్భాషలాడిన తమ పార్టీ వారిపైనా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: