ఈ నెల 13 నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వైభవంగా పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడుక కోసం పూలు సమర్పించదలచుకున్న భక్తులు... మిగతా రోజుల్లో చిన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్పార్చన మండపం వద్ద సమర్పించాలని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.
ఉదయం ఎనిమిది గంటలలోపు పుష్పాలు సమర్పించవచ్చని ఈవో చెప్పారు. పుష్పార్చన సేవలో పాల్గొనేందుకు అవసరమైన టిక్కెట్‌ను దేవస్థానం ఆర్జిత సేవ కౌంటర్ నుంచి పొందాలని సూచించారు.
ఇవీ చదవండి:
'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ!