ETV Bharat / state

Public Protest Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​పై ప్రజాగ్రహం.. నిరసనల వెల్లువ.. 'టీడీపీ నేతల హౌస్ అరెస్ట్' - CBN Arrest

Public protest Chandrababu arrest : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అరెస్టును ఖండిస్తూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య జనం రోడ్డెక్కారు. అక్రమ అరెస్టులతో సాధించేదేమీ లేదని సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Public Protest Chandrababu Arrest
Public Protest Chandrababu Arrest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2023, 9:55 AM IST

Updated : Sep 10, 2023, 1:49 PM IST

Public Protest Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​పై ప్రజాగ్రహం.. నిరసనల వెల్లువ.. 'టీడీపీ నేతల హౌస్ అరెస్ట్'

Public Protest Chandrababu Arrest : నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకులను రెండో రోజూ హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజాము నుంచే పొలీసులు టీడీపీ నేతల ఇళ్లకు చేరుకున్నారు. నగరంలో పలు రోడ్లను బారికేడ్లతో దిగ్బంధం చేశారు. నెల్లూరు మాగుంట లేఔట్ లోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వద్దకు తెల్లవారుజామునే పోలీసులు చేరుకున్నారు. ఇంట్లోకి పనివాళ్లు కూడా రాకుండా అడ్డుకున్నారు కార్యకర్తలను అనుమతించలేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, ఆనం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హౌస్ అరెస్ట్ (House arrest) చేసిన పోలీసులు.. ఎవరూ రాకుండా చుట్టుపక్కల రహదారులను దిగ్బంధించారు.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

రిలే దీక్షలు అనుమంతించని పోలీసులు.. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రిలే నిరాహార దీక్షలకు తెలుగుదేశం (Telugudesam Party) పిలుపునివ్వగా.. అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. పట్టణంలోని ఏటీఎం సర్కిల్ వద్ద రిలే దీక్షలకు అనుమతి లేదని, పార్టీ కార్యాలయం వద్దే నిరసన తెలపాలని సూచించారు. దీంతో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case: జగన్​ తమ్ముడికి ఒక రూల్​.. ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా!

మచ్చలేని వ్యక్తి చంద్రబాబు.. చంద్రబాబు అరెస్టు అన్యాయమని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఒక వీడియో విడుదల చేశారు. సీఐడీ (CID) పోలీసులు హై డ్రామాకు తెరలేపారని తెలిపారు. 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పాలనలో చంద్రబాబు మచ్చ లేని వ్యక్తిగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టును బ్లాక్ డేగా గుర్తించాలని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదన్న ఎమ్మెల్యే.. రాజారెడ్డి రాజ్యాంగం ( Raja Reddy Constitution ) నడుస్తోందని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తిరగ బడే రోజులు దగ్గరకు వచ్చాయని పేర్కొన్నారు.

Ajeya kallam and Premchandra Reddy Approved the Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టును ఆమోదించింది అజేయకల్లం: పీవీ రమేశ్‌

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవనంలో టీడీపీ శ్రేణులు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు, చొక్కాలు వేసుకుని నిరసన తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.

కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత అని ఆలూరు టీడీపీ ఇంచార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు దీక్ష చేపట్టారు.

పల్నాడు జిల్లా వినుకొండలోని శివయ్య స్తూపం సెంటర్లో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ముక్తాఫ్ అహ్మద్ ఖండించారు.

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. పార్టీ ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు, ఇతర నాయకులను రెండో రోజు గృహ నిర్బంధంలో ఉంచడంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను ముందస్తు చర్యగా పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎం.ఎం కొండయ్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పర్చూరు బొమ్మల కూడలిలో ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నాయకులు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. గుంటూరు రహదారి పక్కన షామియానా ఏర్పాటు చేసుకుని అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సామూహిక నిరసన దీక్షలు చేపట్టారు. పోలీసులు భగ్నం చేసి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.

నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో నిరాహార నిరసన దీక్ష చేపట్టారు. కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్... చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని అన్నారు.

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. కాశీబుగ్గలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ తన నివాసంలో దీక్ష చేస్తున్నారు. కొత్తూరు మండలం మాతల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోంపేటలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాతపట్నంలో టీడీపీ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

కడపలో టీడీపీ నేతలు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, కడప ఇన్చార్జి మాధవి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శుల బృందం సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టింది.

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. పోలీసులు టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకోవడంతో మహిళలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో చంద్రబాబు నాయుడు కులదైవమైన నాగలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గృహ నిర్బంధం రెండో రోజూ కొనసాగింది. ఇంటి కాంపౌండ్ లోని బాత్రూం వద్ద పోలీసులు ఉండడంపై రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంటి లోపలికి ప్రవేశించడంపై ఆయన మండిపడ్డారు.

Last Updated : Sep 10, 2023, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.