కృష్ణా జిల్లా లాక్ డౌన్ నేపథ్యంలో పూట గడవక పస్తులుండే నిరుపేద కుటుంబాలకు పీఆర్టీయూ తిరువూరు మండల శాఖ తన వంతు సహకారం అందించింది. పట్టణ పరిధిలోని 150 నిరుపేద కుటుంబాలకు రూ. లక్ష విలువైన నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయ సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి వీటిని పంపిణీ చేశారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు పీవీఎన్ ప్రసాద్, పీవీ రావు, యూవీ శేషారావు, మురళీకృష్ణ, నాళ్ళా కాశీ పాల్గొన్నారు.
ఇది చూడండి కరోనా అనుమానితులను పరామర్శించిన మంత్రి