విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా నందిగామలో.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ అన్నారు. కర్మాగారం నష్టాల్లో ఉందని సాకు చూపి.. ప్రైవేటుపరం చేయటం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్పుల్లో.. ఉన్నాయని వాటిని కూడా ప్రైవేటుపరం చేస్తారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: