ETV Bharat / state

'టోల్​గేట్ నిర్మాణం వద్దు... వేరే ప్రాంతానికి తరలించండి' - మోపిదేవి గ్రామంలో టోల్ గేట్ నిర్మాణం వార్తలు

జాతీయ రహదారి నిర్మాణం ఆ విద్యార్థులు, అక్కడి రైతుల పట్ల శాపంగా మారింది. దాదాపు 700 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలోని కొంతభాగంలో.. టోల్​గేట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో కొంతమేర పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. ఈ చర్యను వెంటనే ఆపాలని... ఇతర ప్రాంతంలో నిర్మించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, స్థానిక నాయకులు కోరుతున్నారు.

tollgate construction at mopidevi  krishan district

author img

By

Published : Oct 7, 2020, 5:54 PM IST

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు 216 జాతీయ రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. సుమారు రూ.227 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టింది. రోడ్డు నిర్మాణ బాధ్యతలను ఆర్వీఆర్​ సిఐపిఎల్(జేవీ) దక్కించుకుంది. ఇప్పటికే పనులను 80 శాతం వరకు పూర్తి చేసింది. ఈ క్రమంలో మోపిదేవి పరిధిలోని మత్స్యకారుల విద్యార్థుల కోసం నిర్మించిన పాఠశాల వద్ద టోల్​గేట్​ను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం కొంతమేర పాఠశాల స్థలాన్ని సేకరించే పనిలో పడింది. ఈ చర్యను.. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

700 మంది విద్యార్థులు...

టోల్​గేట్ నిర్మించాలని భావిస్తున్న ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల ఉంది. వీటితో పాటు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలతో పాటు జూనియర్ కాలేజ్​ ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలాంటి ప్రాంతంలో టోల్​గేట్ నిర్మిస్తే వాయు కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందారు. అధికారులు మార్కింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టోల్​గేట్ నిర్మాణం విద్యార్థుల చదువుకు అటంకంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేదల భూములు కూడా...!

30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం స్థానిక పేదలకు భూములను పంపిణీ చేసింది. అయితే వీటిలో కొంతమేర టోల్​గేట్ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేపట్టారు. అయితే తమ భూములను ఎట్టిపరిస్థితుల్లో ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ జె. మాధవిలతకు వినతి పత్రం ఇచ్చారు. టోల్​గేట్ నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు.

ఇదీ చదవండి:

'ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దాం.. రండి.. '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.