ETV Bharat / state

కరోనా పరీక్షల పేరుతో నిలువు దోపిడీ

కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు కరవవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు కాసుల పంటగా మారింది. ఏ అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని రావాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం నుంచి కాళ్లు, కీళ్ల నొప్పుల వరకు అన్నింటికీ ఒకటే మంత్రం జపిస్తున్నారు. అప్పటివరకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో అత్యవసర వైద్య చికిత్సల కోసం కరోనా నిర్ధారణ పరీక్షలకు బాధితులు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా విచ్చలవిడిగా ధరలు పెంచేసి వసూళ్లు చేస్తున్నారు.

queue for corona tests in krishna district

author img

By

Published : Apr 24, 2021, 12:54 PM IST

పంటకాలవ రోడ్డులో నివసించే నారాయణకు రెండు రోజులుగా జ్వరం వస్తోంది. కరోనా అనుమానంతో పరీక్ష చేయించుకునేందుకు ఇందిరాగాంధీ స్టేడియం కేంద్రానికి వెళ్లారు. రెండు రోజులు గడిచినా ఫలితం రాలేదు. దీంతో ఇంటి వద్దకే ఓ ప్రైవేటు ల్యాబ్‌ టెక్నీషియన్‌ వచ్చి యాంటీజెన్‌ పరీక్ష చేశారు. వెంటనే ఫలితం వచ్చింది. దీంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ పరీక్ష ఫలితంపై నమ్మకం లేకపోయినా జాప్యం లేకుండా ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం ఏర్పడింది. ఇంటి వద్ద పరీక్ష చేసేందుకు రూ.1200 తీసుకున్నారు.

విజయవాడలోని ప్రైవేటు రోగ నిర్ధారణ కేంద్రం వద్ద శుక్రవారం దాదాపు కి.మీ మేర జనం బారులు తీరారు. కారణం కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కోసం ఈ వరుస కట్టారు. ఇక్కడ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే దాదాపు వెయ్యి మందికి నమూనాలు స్వీకరించారు. ఈ పరీక్షల కోసం భిన్నరకాలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఫలితం 2 గంటల్లో ఇవ్వాలంటే రూ.2,500, 6గంటల్లోపు అయితే రూ.2వేలు వసూలు చేస్తున్నారు. 12గంటల్లోపు అయితే రూ.1200, ఒక రోజు అయితే రూ.800 వేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. శుక్రవారం అధికారికంగా 831 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 2,500 మందికి పరీక్షలు నిర్వహంచారు. దాదాపు 25 శాతం మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా ప్రైవేటు నిర్ధారణ కేంద్రాల్లో పరీక్షలు సరేసరి. కొవిడ్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు ప్రైవేటు నిర్ధారణ కేంద్రాలు ఈ పేరుతో వేలకు వేలు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వం తరఫున చేసిన పరీక్షలు కనీసం మూడు నుంచి వారం రోజులు సమయం పడుతోంది. దీంతో ఎక్కువ మంది ప్రైవేటు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. అనుమానం ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కొవిడ్‌ పేరుతో ప్రైవేటు నిర్ధారణ కేంద్రాలు భారీగా వసూలు చేస్తున్నాయి. యాంటీజెన్‌ పరీక్ష సాధారణ పరిస్థితుల్లో రూ.200 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి రూ.1200 తీసుకుంటున్నారు. ఈ పరీక్ష పూర్తి స్థాయి నిర్ధారణ కిందకు రాదు. ఒక్క విజయవాడలోనే రోజుకు వేల మంది యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగెటివ్‌ వస్తే ఊపిరి పీల్చుకుంటున్నారు. పాజిటివ్‌ వస్తే మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ కోసం పరుగులు పెడుతున్నారు. పాజిటివ్‌ వస్తేనే ట్రైఏజ్‌ సెంటర్‌లో ఐసోలేషన్‌ కిట్లు ఇస్తారు. దీనిలో 8 నుంచి 14 రోజులకు సరిపడే మందులు ఉంటున్నాయి. ఈ మందులతో ఇంటి వద్ద ప్రత్యేక గదిలో ఉండి చికిత్స తీసుకోవచ్చు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం రావాలంటే జాప్యం జరగడంతో ప్రైవేటు నిర్ధారణ కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ రూ.2,500 వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తరఫున విజయవాడలో ప్రధానంగా ఐజీఎం, దండమూడి స్టేడియాలు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, అర్బన్‌ పీహెచ్‌సీలలో, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలలో చేస్తున్నారు. మొత్తం 136 కేంద్రాలలో పరీక్షలు చేస్తున్నా రోజుకు 2వేలు దాటడం లేదు. వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రజల్లో ఉన్న భయాందోళనలు ప్రైవేటు వారికి కాసులు కురిపిస్తున్నాయి. చికిత్సలోనూ అదే పరిస్థితి. రోగి మరణించినా వసూళ్ల పర్వం ఆగడం లేదు.

30 జిల్లాలో అధికారికంగా రోజుకు 2వేల నుంచి 2,500 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ప్రైవేటులో దీనికి నాలుగు రెట్లు అధికంగా చేస్తున్నారు. విజయవాడ, మచిలీపట్నంతో పాటు ముఖ్యమైన పట్టణాల్లో పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 30 ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారు. గురువారం వరకు 26 ఆస్పత్రులు ఉండగా మరో నాలుగింటికి అనుమతులు ఇచ్చేశారు.

కొత్త కేసులు 831

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 831 కేసులు నమోదు కాగా, మొత్తం వాటి సంఖ్య 57,547కి చేరింది. 5,957 మంది బాధితులు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 50,858 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. నలుగురు మృతి చెందగా, మృతుల సంఖ్య 732కి చేరింది.

దారి పొడవునా బారులే

జిల్లాలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఏమాత్రం అనారోగ్యకర లక్షణాలు కనిపించినా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. టిక్కిల్‌రోడ్డులో శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు పరీక్ష కేంద్రం వద్ద పెద్దఎత్తున కొవిడ్‌ అనుమానితులు పరీక్షల కోసం బారులు తీరారు. ప్రభుత్వ నిర్ధారణ కేంద్రంలో ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.