6 నెలలుగా 167 మంది తహసీల్దార్లకు జీతాల్లేవని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. పదోన్నతి ఉద్యోగులకు జీతాల్లేవన్న ఆయన.. బదిలీ అయిన ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బదిలీ అయిన మరో 183 మంది సిబ్బంది పరిస్థితి అలాగే ఉందన్నారు. నిషేధం ఉన్నా సొంత నిర్ణయాలతో బదిలీ చేశారన్నారు. అడ్డగోలుగా బదిలీ చేసిన అధికారుల జీతాలు నిలిపివేయాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయని రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారని వెల్లడించారు.
ఇవీ చూడండి...