ETV Bharat / state

వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జాబితా సిద్ధం చేయండి: కలెక్టర్ - Vaccination in AP News

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని... జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. పేరు, పని చేస్తున్న ప్రదేశం, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ సహా.. వివరాలన్నింటినీ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్
కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్
author img

By

Published : May 23, 2021, 5:34 PM IST

జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి నివేదిక పంపిచాలని... జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయి అధికారులను కలెక్టరు ఇంతియాజ్ ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ అందించేందుకు పెద్దఎత్తున టీకా డ్రైవ్ చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒకరి నుంచి మరోకరికి కొవిడ్ వ్యాప్తి చెందకుండా విచ్ఛిన్నం చేసేందుకు కీలకమవుతుందని చెప్పారు.

జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారి కార్యాలయాల్లో పనిచేస్తూ.. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పేరు, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం, వయస్సు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరుతో సహా జాబితాను ఇవ్వాలని స్పష్టం చేశారు. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి పంపించాలని కలెక్టరు ఆదేశించారు.

ఇదీ చదవండీ... 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.